Veere Di Wedding Movie Makes Sensations In India
అడల్ట్ కామెడీతో రూపొందిన వీర్ ది వెడ్డింగ్ చిత్రంపై సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. నలుగురు బాల్య స్నేహితురాళ్ల జీవితం, వారి లైఫ్‌లో చోటుచేసుకొన్న సంఘటనలు ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు, డైలాగ్స్ కేవలం పెద్దలకు మాత్రమే అనే రేంజ్లో ఉండటం, కొన్ని సీన్లు వివాదాస్పదంగా మారడంతో ఈ సినిమాపై పెరుగుతున్నది. <br />వీర్ ది వెడ్డింగ్ చిత్రంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరభాస్కర్, శిఖా తల్సానియా నటించారు. అయితే హాలీవుడ్లో రూపొందిన సెక్స్ అండ్ ది సిటీ చిత్రానికి దాదాపు దగ్గరవుండటం వల్ల ఆ చిత్రానికి కాపీ అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. <br />సెక్స్ అండ్ ది సిటీ, వీర్ ది వెడ్డింగ్ రెండు చిత్రాల్లోనూ కథ నలుగురు అమ్మాయిలదే. మిరాండా పోషించిన పాత్రను హిందీలో అవనీ (లాయర్) రోల్‌ను సోనమ్ కపూర్ పోషించారు. పెళ్లి కంటే కెరీర్ ముఖ్యమని భావించే నవతరం అమ్మాయి. <br />నలుగురు స్నేహితురాళ్లలో మీరా (శిఖా తల్సానియా) మధ్య వయసులో ఉన్న యువతి పాత్రను పోషించారు. చిన్న వయసులో తల్లి బాధ్యతను మోస్తూ చికాకు పడే పాత్ర. సెక్స్ అండ్ సిటీలో చార్లేట్ (క్రిస్టిన్ డెవిస్) పోషించింది. <br />